భారతదేశం, నవంబర్ 2 -- నకిలీ మద్యం తయారీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయన అనుచరుడు ఆరేపల్లి రామును కూడా అదుపులోకి తీసుకున్నారు. ఉదయం 5 గంటలకే జోగి రమేశ్ ఇంటికి అధికారులు చేరుకోగా. చాలాసేపు హైడ్రామా చోటు చేసుకుంది. పోలీసుల పర్యవేక్షణలో ఆయన నివాసం నుంచి తరలించారు.

కొద్దిరోజుల కిందట ఇబ్ర‌హీంప‌ట్నం, ముల‌క‌ల‌చెరువుల‌లో న‌కిలీ మ‌ద్యం త‌యారీ డంప్‌లు బ‌య‌ట‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో ప్ర‌ధాన నిందితుడిగా జ‌నార్ద‌న్‌రావు ఉన్నాడు. ఇప్పటికే అతడిని అరెస్ట్ చేయగా.. పోలీసులు క‌స్ట‌డీకి కూడా తీసుకున్నారు. కస్టడీలో ఇచ్చిన వివరాల ఆధారంగా జోగి రమేశ్ ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

జ‌నార్ద‌న్‌రావు న‌కిలీ మ‌ద్యం త‌యారీకి సంబంధించి ఓ వీడియో కూడా కొద్దిరోజుల కిందట విడు...