భారతదేశం, జనవరి 22 -- ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా శిరివెళ్లమెట్ట వద్ద అర్ధరాత్రి దాటిన తర్వాత బస్సు ప్రమాదం జరిగింది. ఒక ప్రైవేట్ బస్సు, కంటైనర్ ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. డీసీఎం వాహన డ్రైవర్ కారణంగా అనేక మంది ప్రాణాలతో బయటపడ్డారు.

ఏఆర్‌బీసీవీఆర్ ప్రైవేట్ ట్రావెల్స్ నడుపుతున్న ప్రైవేట్ బస్సు టైరు పేలి పోయింది. దీంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను దాటి.. బస్సు అవతలి వైపు వెళ్లింది. అటు నుంచి వస్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టింది. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో బస్సు, కంటైనర్ ట్రక్కు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇద్దరు డ్రైవర్లు, ట్రక్కు క్లీనర్ గుర్తుపట్టలేనంతగా కాలిపోయారు.

రెండు వాహనాలు ఢీకొన్నప్పుడు, ప్రైవేట్ బస్సులో భారీగా మంటలు చెలరేగాయి. మంటలు చాలా వేగంగా వ్యాప...