భారతదేశం, జనవరి 1 -- ఓ తండ్రి తన ముగ్గురు మైనర్ కుమారులను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణమైన ఘటన నంద్యాల జిల్లాలోని ఉయ్యాలవాడ మండలంలో వెలుగు చూసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

స్థానిక పోలీసుల వివరాల ప్రకారం.. తుడుములదిన్నె గ్రామానికి చెందిన వేములపాటి సురేంద్ర (35) ఈ దారుణానికి ఒడిగట్టాడు. తన ముగ్గురు పిల్లలైన కావ్యశ్రీ (7), జ్ఞానేశ్వరి(4), సూర్యగగన్‌(2)లకు విషం కలిపిన కూల్‌డ్రింక్‌ను తాగించాడు. దీంతో ఈ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆపై తండ్రి సురేంద్ర కూడా ఉరి వేసుకొని చనిపోయాడు.

గతేడాది ఆగస్టులో సురేంద్ర భార్య. మహేశ్వరి అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. ఆ తర్వాత నుంచి సురేంద్ర మానసికంగా ఇబ్బందిపడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ...