Andhrapradesh,nandyala, ఏప్రిల్ 19 -- నంద్యాల‌ జిల్లాలో దారుణం జరిగింది. ఓ మ‌హిళ‌తో ఏపీఎస్పీ కానిస్టేబుల్ సంబంధం పెట్టుకున్నాడు. అయితే ఆ త‌రువాత అత‌డి స్నేహితుడు. ఆమెకు ద‌గ్గ‌ర‌య్యాడు. వీరిద్దరూ క‌లిసి కానిస్టేబుల్‌ను అంతమొందించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. విందు పేరుతో పిలిచి అతి ఘోరంగా హ‌త‌మార్చారు. మృత దేహాన్ని స‌మీపంలోని వంతెన కింద ప‌డేశారు.

ఈ దారుణ ఘ‌ట‌న నంద్యాల జిల్లా కేంద్రం శివారులో చోటు చేసుకుంది. తొలుత అదృశ్యం కేసు న‌మోదు చేసిన పోలీసులు విచార‌ణ‌లో వివాహేత‌ర సంబంధంతో హ‌త్య చేసిన‌ట్లు శుక్ర‌వారం వెల్ల‌డించారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. నంద్యాల‌ జిల్లా ఆళ్ల‌గ‌డ్డ మండ‌లం కోట‌కందుకూరుకు చెందిన ఏపీఎస్పీ కానిస్టేబుల్ ముల్లా ఫ‌రూక్ (36) ప్ర‌స్తుతం మంగ‌ళ‌గిరిలోని అక్టోప‌స్ విభాగంలో విధులు నిర్వ‌హిస్తున్నాడు. ఫ‌రూక్‌కు ఇద్ద‌రు కుమ...