భారతదేశం, ఫిబ్రవరి 12 -- బాలీవుడ్ ఇండస్ట్రీలో గత ఏడాది సెన్సేషన్ సృష్టించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్' (Dhurandhar). ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఏకంగా రూ. 1,300 కోట్లకు పైగా వసూళ్లను సాధించి సరికొత్త రికార్డులను నెలకొల్పింది.

ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'ధురంధర్: ది రివెంజ్' (Dhurandhar: The Revenge) ఆడియెన్స్ ముందుకు రానుందనే విషయం తెలిసిందే. ధురంధర్ 2 టీజర్ విడుదలైనప్పటి నుంచి ట్రైలర్ కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సీరియల్ హీరోయిన్ రూపాలీ గంగూలీ పంచుకున్న విశేషాలు, ధురంధర్ 2పై ఇచ్చిన రివ్యూ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి.

రూపాలీ గంగూలీ సోదరుడు విజయ్ గంగూలీ ఈ చిత్రానికి కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. 'ధురంధర్'లోని పాపులర్ సాంగ్స్ 'షరారత్', 'ఫాస్లా'ను ఆయనే కంపోజ్ చేశారు. తాజా...