భారతదేశం, డిసెంబర్ 30 -- లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ ధురంధర్ రికార్డుల వేట కొనసాగిస్తోంది. మరే బాలీవుడ్ సినిమాకు సాధ్యం కాని ఫీట్ ను అందుకుంది. ఇండియాలో రూ.700 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించిన తొలి బాలీవుడ్ సినిమాగా ధురంధర్ హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ లో ర‌ణ్‌వీర్ సింగ్‌ హీరో.

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మూడు వారాలకు పైగా ప్రయాణించిన తరువాత ర‌ణ్‌వీర్ సింగ్‌ సినిమా ధురంధర్ మరో రికార్డు అందుకుంది. ర‌ణ్‌వీర్ సింగ్‌, సారా అర్జున్ జంటగా నటించిన ఈ చిత్రం వసూళ్లు సోమవారం కాస్త పడిపోయాయి. అయినా రికార్డుల మోత మాత్రం ఆగలేదు. సక్నిల్క్ ప్రకారం ధురంధర్ సోమవారం (డిసెంబర్ 29) రూ.10 కోట్లకు పైగా వసూలు చేసింది.

ధురంధర్ సినిమా ఇండియా నెట్ కలెక్షన్లలో కొత్త రికార్డు అందుకుంది. ఈ మూవీ ఇండియాలోనే రూ.700 కోట్ల క్లబ్ లో ప్రవేశించింది. ఈ ఘనత సాధ...