భారతదేశం, డిసెంబర్ 27 -- ధురంధర్ సినిమాలో అక్షయ్ ఖన్నా యాక్టింగ్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. కానీ మరోవైపు మాత్రం సంచలన ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అజయ్ దేవగణ్ హీరోగా తెరకెక్కుతున్న దృశ్యం 3 సినిమా షూటింగ్ నుంచి అతను తప్పుకోవడమే ఇందుకు కారణం. అక్షయ్ ఖన్నాకు ధురంధర్ విజయం తలకెక్కిందని దృశ్యం 3 ప్రొడ్యూసర్ కుమార్ మంగత్ పాఠక్ హిందుస్థాన్ టైమ్స్ తో మాట్లాడుతూ చెప్పాడు.

దృశ్యం 3 సినిమా నుంచి అక్షయ్ ఖన్నా తప్పుకోవడం వెనుక ఉన్న కారణాలను మంగత్ పాఠక్ వెల్లడించాడు. అంతే కాకుండా అతని స్థానంలో జైదీప్ అహ్లావత్ ను తీసుకున్నట్లు చెప్పాడు. ఛావా, ధురంధర్ విజయాలతో అక్షయ్ ఖన్నా తన రెమ్యునరేషన్ రూ.21 కోట్లకు పెంచాడని, అలాగే దృశ్యం 3 లో విగ్ వాడతానని చెప్పాడని పాఠక్ పేర్కొన్నాడు. దృశ్యం 2లో అక్షయ్ బట్టతలతో కనిపించాడు.

శనివారం (డిసెంబర్ 27) నిర్మాత కుమార్ మంగత్...