భారతదేశం, జనవరి 16 -- ధురంధర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర రికార్డుల వేటను ఇంకా కొనసాగిస్తూనే ఉంది. థియేటర్లలోకి వచ్చిన 42 రోజులకు కూడా ఈ మూవీ కొత్త హిస్టరీ క్రియేట్ చేస్తూనే ఉంది. 42వ రోజు బాక్సాఫీస్ దగ్గర అత్యధిక కలెక్షన్లు సాధించిన ఇండియన్ మూవీగా ధురంధర్ నిలిచింది.

ధురంధర్ బాక్సాఫీస్ వద్ద 42 రోజులు పూర్తి చేసుకుంది. దీని బాక్సాఫీస్ ప్రదర్శన అసాధారణమైనది. ఈ చిత్రం భారతీయ సినిమా చరిత్రలో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచింది. 42వ రోజు (జనవరి 15)న రూ.3 కోట్లు ఖాతాలో వేసుకుంది ధురంధర్. ఏ ఇండియన్ మూవీకైనా 42వ రోజు వచ్చిన అత్యధిక కలెక్షన్లు ఇవే. ఛావా (రూ.1.35 కోట్లు) రికార్డును ధురంధర్ బ్రేక్ చేసింది.

రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ రూ.28 కోట్ల భారీ ఓపెనింగ్ డే వసూళ్లతో తన థియేట్రికల్ ప్రయాణాన్ని ప్రారంభించింది....