భారతదేశం, డిసెంబర్ 26 -- బాలీవుడ్ బ్యూటీ యామీ గౌతమ్, డైరెక్టర్ ఆదిత్య ధర్ జంట చూడముచ్చటగా ఉంటుంది. అయితే వీరిద్దరి ప్రేమ కథలో ఎలాంటి సినిమాటిక్ డ్రామాలు లేవట. 'హ్యూమన్స్ ఆఫ్ బాంబే' పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. తమది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదని, స్నేహం నుంచే ప్రేమ పుట్టిందని యామీ ఆసక్తికర విషయాలు పంచుకుంది.

నటి యామీ గౌతమ్, దర్శకుడు ఆదిత్య ధర్ ప్రేమ కథ చాలా సింపుల్ అండ్ స్వీట్. వీరిద్దరూ ఒకరినొకరు ఎలా ఇష్టపడ్డారు అనే విషయాన్ని యామీ తాజాగా బయటపెట్టింది.

2019లో వచ్చిన బ్లాక్‌బస్టర్ సినిమా 'ఉరి: ది సర్జికల్ స్ట్రైక్' (Uri) టైంలో వీరిద్దరూ కలిశారు. ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాలో యామీ ఒక కీలక పాత్ర చేసింది. ఆ సమయంలోనే తాము ఎలా ప్రేమలో పడ్డామో యామీ వెల్లడించింది.

"మేం సినిమా ప్రమోషన్స్ టైంలో మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. ముందు ఫ్రెండ్స్ అయ్యాం....