భారతదేశం, నవంబర్ 20 -- తెలంగాణలో అమలు చేస్తున్న సన్న బియ్యం పంపిణీ పథకం విజయవంతమైందని.. దేశమంతటా ఈ పథకాన్ని విస్తరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి ప్రహ్లాద్​ జోషితో తన అభిప్రాయాలను పంచుకున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని వివరించారు.

పీడీఎస్ బియ్యం రీ సైక్లింగ్ తగ్గిందని, బహిరంగ మార్కెట్లోనూ ధరలు స్థిరపడ్డాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రజలు తినే బియ్యాన్ని పంపిణీ చేయటంతో ఈ పథకం ఆశించిన లక్ష్యం నెరవేరిందని అన్నారు. తెలంగాణలాగే కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ చేసే అంశాన్ని పటిశీలించాలని సూచించారు. పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి దేశవ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ అంశంపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి అన్నారు.

గురువారం ఉదయం ...