భారతదేశం, నవంబర్ 7 -- భారత మార్కెట్‌లో అత్యంత సరసమైన కార్లలో ఒకటిగా మారుతి సుజుకి ఆల్టో కే10 (Maruti Suzuki Alto K10) నిలిచింది. దీని ప్రారంభ ధర రూ. 3.70 లక్షలు (ఎక్స్-షోరూమ్). భారత్‌లో తొలి 'ప్రజల కారు'గా పేరొందిన దిగ్గజ మారుతి 800 వారసత్వాన్ని ఈ మారుతి సుజుకి ఆల్టో ముందుకు తీసుకుపోతోంది. ఆల్టో 800 ఉత్పత్తిని నిలిపివేసిన తరువాత, మారుతి సుజుకి ప్రస్తుతం ఆ ఐకానిక్ నామకరణాన్ని కొనసాగిస్తూ ఆల్టో కే10 మోడల్‌ను విక్రయిస్తోంది.

ఇప్పటివరకు 47 లక్షల యూనిట్లకు పైగా ఆల్టో కార్లు అమ్ముడయ్యాయి. దీంతో, ఈ కార్ల తయారీ సంస్థ నుంచి అత్యధికంగా అమ్ముడైన కారుగా ఆల్టో రికార్డు సృష్టించింది. 1983 నుంచి మారుతి సుజుకి సంస్థ మొత్తం మూడు కోట్ల కార్లను విక్రయించడం ఈ వేడుకల మూడ్‌ను మరింత పెంచింది.

మారుతి సంస్థ నుంచి అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో వాగన్ఆర్ 34 ల...