భారతదేశం, నవంబర్ 24 -- బాలీవుడ్ ఐకాన్ ధర్మేంద్రను అతని భారీ శరీరాకృతి, యాక్షన్ మ్యాన్ క్యారెక్టర్ కారణంగా 'హీ మ్యాన్'గా గుర్తింపు పొందాడు. అయితే అతని సినీ ప్రయాణం మాత్రం ఒక రొమాంటిక్ స్టార్‌గా మొదలైంది. నిజానికి 1960ల చివర్లో, 1970ల ప్రారంభంలో అతడు ఇండస్ట్రీలోనే అత్యంత అందమైన నటులలో ఒకరిగా నిలిచాడు. అంతర్జాతీయ మీడియా కూడా అతన్ని 'ప్రపంచంలోనే అత్యంత అందమైన పురుషులలో' ఒకరిగా పేర్కొన్నదన్న నిజం మీకు తెలుసా?

బాలీవుడ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ నటుల్లో ధర్మేంద్ర ఒకడు. కెరీర్లో 75 హిట్స్ అందుకున్న ఏకైక బాలీవుడ్ నటుడు. అయితే 1970లలో ధర్మేంద్ర ప్రముఖ నటుడిగా స్థిరపడినప్పుడు అతని గురించి దేశీయంగానే కాదు విదేశాలలో కూడా అనేక సినీ పత్రికలు ప్రత్యేక కథనాలు రాశాయి. 1970లలో అంతర్జాతీయ పబ్లికేషన్‌లు ప్రపంచంలో అత్యంత అందమైన పురుషులలో అతన్ని టాప్ 10, టాప్ 5 జాబి...