భారతదేశం, నవంబర్ 24 -- బాలీవుడ్ ఐకాన్, సీనియర్ నటుడు ధర్మేంద్ర సోమవారం (నవంబర్ 24) కన్నుమూశాడు. 89 ఏళ్ల ఈ వెటరన్ నటుడు ఈ నెల ప్రారంభంలో ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రిలో చేరి, కోలుకుని ఇంటికి వచ్చాడు. యాక్షన్ హీరోల నుంచి రొమాంటిక్ లీడ్స్ ఆరు దశాబ్దాల సినీ ప్రయాణంలో ధర్మేంద్ర ఎంతో మంది బాలీవుడ్ హీరోల కంటే ఎక్కువ విజయాలను రుచి చూశాడు. అయినప్పటికీ ఆశ్చర్యకరంగా 'సూపర్‌స్టార్' అనే హోదా మాత్రం అతనికి దక్కలేదు.

ధర్మేంద్ర కేవల్ కృష్ణ డియోల్ 1960లో 24 ఏళ్ల వయసులో 'దిల్ భీ తేరా హమ్ భీ తేరే' సినిమాతో సినీ ప్రయాణం మొదలుపెట్టాడు. ఆ తర్వాత 'బందిని', 'ఆయే మిలన్ కి బేలా', 'కాజల్' వంటి చిత్రాలలో సహాయ పాత్రల్లో కనిపించాడు. అయితే 1965లో వచ్చిన వార్ మూవీ 'హకీకత్' అతడిని బాక్సాఫీస్ దృష్టిని ఆకర్షించేలా చేసింది. ఆ తర్వాత 'ఫూల్ ఔర్ పత్తర్' సినిమాతో అతని రేంజ్ మరో స్థ...