భారతదేశం, నవంబర్ 14 -- ముంబైలోని ఆసుపత్రిలో ధర్మేంద్ర చేరిన సమయంలో, ఆయనను పరామర్శించిన తొలి వ్యక్తులలో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఒకరు. తాజాగా సల్మాన్ ఖాన్ సీనియర్ నటుడిపై తనకున్న అమితమైన ప్రేమను వ్యక్తం చేశాడు. ధర్మేంద్ర తనకు "తండ్రితో సమానం" అని పేర్కొన్న సల్మాన్.. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని తెలిపాడు.

గురువారం (నవంబర్ 13) ఖతార్‌లో జరిగిన ద-బంగ్ ది టూర్ రీలోడెడ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సల్మాన్ ఖాన్ పాల్గొన్నారు. ఈవెంట్‌లో తన ఫిట్‌నెస్ ప్రయాణానికి ఎవరు స్ఫూర్తి అని సల్మాన్‌ను అడగగా.. అతడు వెంటనే ధర్మేంద్ర పట్ల తన అభిమానాన్ని, అనుబంధాన్ని వ్యక్తపరిచాడు.

సల్మాన్ మాట్లాడుతూ.. "నేను రాకముందు ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వారిలో ధరమ్ జీ అత్యంత ముఖ్యమైన వారు" అని అన్నాడు. "ఆయన నా తండ్రి, అంతే. ఆయన్ను నేను ప్రేమిస్తున్నాను. ఆ...