భారతదేశం, నవంబర్ 24 -- హిందీ సినిమాల్లో రొమాంటిక్ కలయికల విషయానికి వస్తే ధర్మేంద్ర, హేమమాలిని క్లాసిక్ జోడీ ఎప్పుడూ అగ్రస్థానంలో ఉంటుంది. హేమమాలిని అందం, సొగసుకు నిదర్శనంగా నిలిచి డ్రీమ్ గర్ల్‌గా పేరుగాంచగా.. ధర్మేంద్ర తన ఆకర్షణతో, నటనతో ప్రసిద్ధి చెందాడు. ఈ ఇద్దరు దిగ్గజాలు కలిసినప్పుడు అది బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడం, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడం ఖాయమైంది.

1970లు, 1980లలోని ప్రతి బాలీవుడ్ జానర్‌ను కవర్ చేసిన ఫిల్మోగ్రఫీ ఈ జంట సొంతం. మరి వాటిలో అభిమానులను బాగా ఆకర్షించిన టాప్ 10 సినిమాలు ఏవో ఇక్కడ చూడండి. ప్రస్తుతం వీటిలో కొన్ని ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయి.

భారతీయ సినిమాల్లోనే అత్యుత్తమ చిత్రాలలో ఒకటి షోలే. ఇందులో ధర్మేంద్ర, హేమ జోడీ బాగా ఆకట్టుకుంది. ధర్మేంద్ర సరదాగా ఉండే వీరూ పాత్రలో, హేమమాలిని చురుకైన ఓ గుర్రపు బండి నడిపే గ్ర...