Andhrapradesh, ఆగస్టు 16 -- శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరంలో ఎన్ఐఏ సోదాలు జరిపింది.నూరు మహమ్మద్(40) అనే వ్యక్తి శనివారం ఉదయం అదుపులోకి తీసుకుంది. అతని నివాసంలో 16 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకుంది.

జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థతో నూర్ మహ్మద్ సంబంధాలు ఉన్నాయన్న అనుమానాల నేపథ్యంలో ఈ సోదాలు జరిగాయి. జైషే మహ్మద్ సంస్థకు చెందిన వాట్సాప్ గ్రూపుల్లో నూర్ సభ్యుడిగా ఉన్నట్లు తెలిసింది. అంతేకాకుండా యువతను ఉగ్రవాదం వైపు మళ్లించేలా వాట్సాప్ గ్రూపుల్లో వ్యాఖ్యలు చేస్తున్నట్లు గుర్తించారు. వాట్సాప్ చాట్ లో నూర్ మహ్మద్ యాక్టివ్ గా ఉన్నట్లు సమాచారం.

ప్రాథమిక సమాచారం ప్రకారం. నూర్ మహమ్మద్ దాదాపు 15 సంవత్సరాల క్రితం ధర్మవరం పట్టణంలో స్థిరపడ్డాడు. స్థానిక హోటళ్లలో పనిచేస్తూ జీవనోపాధి పొందడం ప్రారంభించాడు. ప్రస్తుతం అతను.. మార్కెట్ వీధిలోని ఒక టీ స్టాల్‌లో ప...