భారతదేశం, డిసెంబర్ 2 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. ఆ సమయంలో శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడడం చూస్తూ ఉంటాం. ప్రతి గ్రహం కూడా కాలానుగుణంగా వాటి రాశులను మారుస్తూ ఉంటుంది. గ్రహాలు వాటి రాశులను మార్చినప్పుడు, నక్షత్రాలను మార్చినప్పుడు కూడా 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి.

త్వరలో ధనస్సు రాశిలో కొన్ని గ్రహాల సంచారం జరగబోతోంది. అది మామూలు సంయోగం కాదు. చంద్రుడు, కుజుడు, గురువు, శుక్రుడు, సూర్యుడు ధనస్సు రాశిలో ఉంటారు. ఐదు గ్రహాలు సంచరించిన వెంటనే ధనుస్సు రాశిలో చంద్రుడు, సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు సంయోగం చెందుతాయి. ఈ గ్రహాల సంయోగం పంచగ్రాహి యోగాన్ని సృష్టిస్తోంది.

ఒకేసారి ధనస్సు రాశిలో ఐదు గ్రహాల సంచారం జరగడంతో ద్వాదశ రాశుల వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి. ముఖ్యంగా కొన్ని రాశుల వారిక...