భారతదేశం, నవంబర్ 20 -- తమిళ నటి మాన్య ఆనంద్, నటుడు ధనుష్ మేనేజర్ శ్రేయస్ చుట్టూ తిరుగుతున్న కాస్టింగ్ కౌచ్ ఆరోపణల వివాదం మరో మలుపు తిరిగింది. వీటిపై శ్రేయస్ క్లారిటీ ఇవ్వగా.. అటు మాన్య కూడా మాట మార్చింది. ఎవరో నకిలీ వ్యక్తి ధనుష్ పేరును దుర్వినియోగం చేస్తున్నారనే తాను చెప్పానని, కానీ అవి కాస్తా ధనుష్, అతని మేనేజర్ పై ఆరోపణలుగా మారాయని ఆమె అనడం గమనార్హం.

'వనతై పోల' అనే టీవీ షో ద్వారా గుర్తింపు పొందిన నటి మాన్య ఆనంద్.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ధనుష్ మేనేజర్ శ్రేయస్ పై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసినట్లుగా ఒక వీడియో క్లిప్ వైరల్ అయ్యింది. ఈ వివాదంపై స్పందిస్తూ.. మాన్య, ధనుష్ మేనేజర్ శ్రేయస్ బుధవారం (నవంబర్ 18) సాయంత్రం సోషల్ మీడియాలో ప్రకటనలు విడుదల చేశారు.

మాన్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ప్రకటనను విడుదల చేస్తూ.. వీడియోను ఇష్టానుసారం కట్ చేసి, ధనుష...