భారతదేశం, నవంబర్ 18 -- తమిళ టీవీ నటి మాన్యా ఆనంద్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ధనుష్ మేనేజర్ అయిన శ్రేయస్ పై సంచలన ఆరోపణలు చేసింది. కాస్టింగ్ కౌచ్ ద్వారా తనను లైంగికంగా వేధించడానికి ప్రయత్నించాడని ఆమె ఆరోపించింది. ఈ సంచలన ఆరోపణలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అది కూడా ధనుష్ లాంటి నటుడి పేరు రావడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

తమిళ టీవీ నటి మాన్య ఆనంద్ ఇటీవల 'సినివులగం' (Cineulagam)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. నటుడు ధనుష్ మేనేజర్ శ్రేయస్ తనను కాస్టింగ్ కౌచ్‌ ద్వారా వేధించడానికి ప్రయత్నించాడని ఆరోపించింది. శ్రేయస్ ఒక కొత్త సినిమా వివరాలతో తనను సంప్రదించి, అనుచితమైన ప్రతిపాదన చేశాడని ఆమె పేర్కొంది.

శ్రేయస్ తనతో "కొంత కమిట్‌మెంట్ (సర్దుబాటు) ఉంటుంది" అని చెప్పాడని మాన్య గుర్తు చేసుకుంది. అంటే వృత్తిపరమైన పరిధులను దాటి ఏదైనా ఆశించాడని ఆమె అర్థం చేసుకుంద...