భారతదేశం, నవంబర్ 14 -- తమిళ స్టార్ హీరో ధనుష్ నెక్ట్స్ మూవీ వచ్చేస్తోంది. ప్రముఖ దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్ డైరెక్షన్ లో 'తేరే ఇష్క్ మే' (Tere Ishk Mein) ట్రైలర్ శుక్రవారం (నవంబర్ 14) విడుదలైంది. 12 సంవత్సరాల క్రితం వచ్చిన 'రాంజనా' (Raanjhanaa) తర్వాత ధనుష్, ఆనంద్ ఎల్. రాయ్ కలయికలో వస్తున్న చిత్రమిది.

'తేరే ఇష్క్ మే' మూవీలో ధనుష్‌తో పాటు కృతి సనన్ కూడా నటించింది. ఈ కథ ధనుష్ పోషించిన ఓ ఆవేశంతో కూడిన, హింసాత్మక ప్రవృత్తి ఉన్న యువకుడి చుట్టూ తిరుగుతుంది. అతను ముక్తి (కృతి సనన్) ప్రేమలో పడతాడు. కానీ ముక్తి త్వరగానే అతడిపై మనసు మార్చుకుని, వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది.

అమ్మాయి తిరస్కరణకు గురైన ధనుష్ పాత్ర పగతో రగిలిపోతుంది. తన విఫల ప్రేమ కోసం 'ఢిల్లీ మొత్తాన్ని బూడిద చేస్తానని' ప్రతిజ్ఞ చేస్తాడు. అయితే ఇలాంటి పరిస్థితుల...