భారతదేశం, నవంబర్ 15 -- ధనుష్ ఈ నెలలో తన తదుపరి చిత్రం 'తేరే ఇష్క్ మే' విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. 'రాంఝానా', 'అత్రంగి రే' తర్వాత దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్‌తో కలిసి ధనుష్ చేసిన రొమాంటిక్ డ్రామా చిత్రం ఇది. ఈ సినిమా ట్రైలర్ శుక్రవారం (నవంబర్ 14) విడుదలైంది. దీనికి అభిమానుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. సంచలన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కూడా ఈ ట్రైలర్ పై ప్రశంసలు కురిపించాడు.

తేరే ఇష్క్ మే ట్రైలర్ పై సందీప్ రెడ్డి వంగా రివ్యూ వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో ఆయన పోస్టు తెగ చక్కర్లు కొడుతోంది. సందీప్ తన ఎక్స్ ఖాతాలో చిత్ర ట్రైలర్‌ను పంచుకున్నారు. క్యాప్షన్‌లో ఇలా రాసుకొచ్చాడు. "ఉద్వేగభరితమైనది!!! ధనుష్ తన సింహాసనాన్ని తిరిగి చేజిక్కించుకున్నట్లు అనిపిస్తుంది.. అభినందనలు'' అని సందీప్ పేర్కొన్నాడు. ఈ మూవీతో ధనుష్ తన సింహాసనాన్ని త...