భారతదేశం, డిసెంబర్ 3 -- బాలీవుడ్ మూవీ 'తేరే ఇష్క్ మే' ప్రమోషన్లలో నటుడు ధనుష్ బిజీగా ఉన్నాడు. ముంబై సహా పలు నగరాల్లో తిరుగుతూ సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. ఈ క్రమంలో జరిగిన ఒక ఈవెంట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. కేవలం తన దుస్తులను సరిచేయడానికే ధనుష్ ఒక అసిస్టెంట్ ను నియమించుకున్నారని కొందరు నెటిజన్లు ఆరోపించగా.. అతని అభిమానులు వెంటనే స్పందించి వాస్తవాలను బయటపెట్టారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. ధనుష్ ఒక ఈవెంట్ కోసం కారు దిగి నిలబడి ఉంటాడు. అతని వెనుక నుంచి ఒక అమ్మాయి పరుగెత్తుకుంటూ వచ్చి అతని ప్యాంట్‌ను సరిచేస్తుంది. ఆ తర్వాత షర్ట్‌ను కూడా సరిచేస్తూ అతని వెనకే ఉంటుంది. ధనుష్ మాత్రం ఆమెను గమనించనట్లుగా ముందుకు సాగిపోయాడు.

ఈ వీడియోను షేర్ చేస్తూ.. "అతని అవుట్‌ఫిట్ సరిగ్గా ఉందో లేదో చూసుకోవడానికి అసిస్...