భారతదేశం, సెప్టెంబర్ 17 -- నటుడు ధనుష్ తాను దర్శకత్వం వహించి నటించిన తన తదుపరి చిత్రం 'ఇడ్లీ కడై' ఆడియో విడుదల వేడుకలో తన బాల్యం గురించి మాట్లాడాడు. చెన్నైలో జరిగిన ఈ వేడుకలో ధనుష్ బాల్యంలో ఇడ్లీలు కొనుక్కోవడానికి డబ్బులు లేక పూలు సేకరించి అమ్ముకునేవాడినని చెప్పాడు. కానీ నెట్టింట అతని మాటలను చాలామంది నమ్మలేదు. డైరెక్టర్ కొడుక్కి ఇడ్లీలు కొనేందుకు డబ్బులు ఉండవా? అని ప్రశ్నిస్తున్నారు.

ధనుష్ ఈ ఆడియో లాంఛ్ వేడుకలో బాల్యంలో తనకు ఇడ్లీలంటే ఎంతో ఇష్టమని, ప్రతిరోజూ తినాలని కోరుకునేవాడినని చెప్పాడు. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా అవి కొనుక్కోలేకపోయానని అన్నాడు. "పిల్లవాడిగా, నాకు ప్రతిరోజూ ఇడ్లీలు తినాలని ఎంతో కోరిక ఉండేది. కానీ నేను వాటిని కొనుక్కోలేకపోయాను. అందుకే మేము పొరుగువారి నుండి పూలు సేకరించడం మొదలుపెట్టాము. మేము సేకరించే పూల పరి...