Hyderabad, జూన్ 18 -- ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా, డైరెక్టర్ శేఖర్ కమ్ముల లాంటి క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా మూవీ కుబేరపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా వచ్చే శుక్రవారం (జూన్ 20) రిలీజ్ కానుండగా ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అయితే ధనుష్ లాంటి స్టార్ ఉన్నా తమిళనాడులో ఈ సినిమా ప్రభావం ఏమాత్రం కనిపించడం లేదు.

కుబేర మూవీలో నాగార్జున, రష్మికతో కలిసి ధనుష్ స్క్రీన్ పంచుకోనున్నాడు. దీంతో సహజంగానే మూవీపై ఓ రేంజ్ అంచనాలు ఉన్నాయి. అందుకు తగినట్లే అడ్వాన్స్ బుకింగ్స్ ఉంటాయని భావించిన మేకర్స్ కు షాక్ తగిలింది. ఇక్కడ నైజాం ఏరియాలో బుకింగ్స్ ఫర్వాలేదనిపిస్తున్నా.. తమిళనాడులో మాత్రం అసలు బజ్ లేదు.

ధనుష్ మూవీ వస్తుందంటే కనిపించే సందడి ఇప్పుడు లేదు. గత పదేళ్లలో ఎప్పుడూ లేనంత దారుణంగా ఓ ధనుష్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ఉన్న...