భారతదేశం, నవంబర్ 28 -- ధనుష్, మృణాల్ ఠాకూర్.. ఇప్పుడు కోలీవుడ్ లోనే కాదు ఇండియన్ మూవీ ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ గా మారారు. ఈ ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీళ్ల రిలేషన్ షిప్ ను సీక్రెట్ గా ఉంచారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా ఈ ఊహాగానాలు మరింత ఎక్కువయ్యాయి. దీనికి హీరోయిన్ మృణాల్ ఠాకూర్ చేసిన ఓ పనే కారణం.

ధనుష్ ఇటీవల వారణాసి సందర్శించినప్పటి ఫోటోల సిరీస్‌ను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు. ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వం వహించిన 'రాంఝానా' చిత్రంలో తన కుందన్ పాత్ర ప్రయాణం ఎక్కడ మొదలైందో అక్కడే ఈ జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. దశాబ్దానికి పైగా తనను వదలని కుందన్ పాత్ర పేరు ఇప్పటికీ బనారస్ వీధుల్లో ప్రతిధ్వనిస్తుందని, ప్రజలు పిలిచినప్పుడు తను తిరిగి నవ్వుతూ వెళ్తానని ధనుష్ భావోద్వేగంతో కూడిన పోస్ట్ పెట్టారు. దీ...