భారతదేశం, జనవరి 25 -- టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితులైన ధనుష్, మృణాల్ ఠాకూర్ పెళ్లి గురించి గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఆ వార్తలను ఇప్పటికే కొట్టిపారేసినప్పటికీ.. అభిమానులు మాత్రం ఈ ఇద్దరినీ జంటగా చూడాలని తెగ ఆశపడుతున్నారు. తాజాగా ఈ క్రేజీ కాంబినేషన్‌పై ఒక వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యక్షమై నెటిజన్లను షాక్‌కు గురిచేసింది.

జనవరి 24న ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ధనుష్, మృణాల్ ఠాకూర్ వివాహం చేసుకున్నట్లు ఒక వీడియో పోస్ట్ అయింది. చెన్నైలో జనవరి 22న చాలా రహస్యంగా, కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ పెళ్లి జరిగిపోయిందని ఆ వీడియో సారాంశం.

కానీ, ధనుష్, మృణాల్ పెళ్లి వేడుకకు స్టార్ హీరోలు దళపతి విజయ్, అజిత్ కుమార్, దుల్కర్ సల్మాన్, సూర్య, హీరోయిన్లు త్రిష, శ్రుతి హాసన్, సంగీత దర్శకుడు అనిరుధ్ వంటి స్టార్లందర...