భారతదేశం, డిసెంబర్ 11 -- బాలీవుడ్‌లో రొమాంటిక్ చిత్రాలతో మంచి ఫామ్‌లో ఉన్న దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్. ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం 'తేరే ఇష్క్ మే'. ఇందులో నేషనల్ అవార్డ్ విన్నర్ ధనుష్, బ్యూటిపుల్ హీరోయిన్ కృతి సనన్ జంటగా నటించారు. నవంబర్ 28న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించిన వసూళ్లతో దూసుకుపోతోంది.

తెరే ఇష్క్ మే సినిమా రెండో వారంలోకి అడుగుపెట్టినప్పటికీ రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్' వంటి భారీ పోటీని సైతం తట్టుకుని తన వసూళ్ల ప్రభావాన్ని కొనసాగిస్తోంది. తాజాగా, ఈ చిత్ర నిర్మాణ సంస్థ ఈ తేరే ఇష్క్ మే బాక్సాఫీస్ లెక్కలను అధికారికంగా ప్రకటించింది.

ధనుష్, కృతి సనన్ జంటగా నటించిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా తేరే ఇష్క్ మే ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్ల మార్క్‌ను దాటిందని చిత్ర యూనిట్ వెల్లడించింది. వరల్డ్ వైడ్‌గా ...