భారతదేశం, జనవరి 27 -- పొలిటికల్ పార్టీ స్థాపించి, రాజకీయాల్లోకి అడుగుపెట్టిన దళపతి విజయ్ తన కెరీర్ లో చేసిన లాస్ట్ మూవీ 'జన నాయగన్'. ఈ చిత్రం రిలీజ్ డేట్ పై మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. జన నాయగన్ విషయంలో దళపతి విజయ్ కు మరోసారి కోర్టు షాకిచ్చింది. సింగిల్ బెంగ్ తీర్పును కొట్టేసిన హై కోర్టు డివిజన్ బెంచ్ మరోసారి సింగిల్ బెంచ్ లోనే సెన్సార్ బోర్డు ఇష్యూను తేల్చుకోవాలని స్పష్టం చేసింది.

జన నాయగన్, సెన్సార్ సర్టిఫికేట్ వివాదంపై ఇవాళ (జనవరి 27) మద్రాస్ హై కోర్టు తీర్పు వెల్లడించింది. చీఫ్ జస్టిస్ ఎంఎం శర్వాశ్రీ, జస్టిస్ జి. అరుణ్ మురుగన్ నేతృత్వంలోని మద్రాస్ హైకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC), 'జన నాయగన్' నిర్మాత కేవీఎన్ ప్రొడక్షన్స్ మధ్య కేసును సింగిల్ బెంచ్ లోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది....