Hyderabad, జూలై 3 -- మనకి మొత్తం 12 రాశులు ఉంటాయి. 12 రాశులకు ఆయా రాశుల ఆధారంగా గ్రహాలు, దేవతలు మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. అయితే ద్వాదశ రాశులకు ఏ దేవత అధిపతి, ఎవరు రక్షిస్తారు, ఎవరి ఆశీస్సులు మనపై ఉంటాయి ఇలాంటి విషయాలను తెలుసుకోవచ్చు. ఏ దేవత ఏ రాశి వారికి అనుగ్రహాన్ని కలిగించి సంతోషంగా ఉంచుతుంది అనేది చూద్దాం.

మేష రాశిని పరిపాలించే గ్రహం కుజుడు. కుజుడు అనుగ్రహంతో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. ఈ రాశి వారు దృఢ నిశ్చయంతో ఉంటారు, పైగా ధైర్యవంతులు కూడా. దుర్గాదేవి మేష రాశి వారికి ధైర్యం, బలాన్ని అందిస్తుంది.

వృషభ రాశిని పరిపాలించేది శుక్రుడు. శుక్రుడు విలాసాలను అందిస్తాడు. లక్ష్మీదేవి వృషభ రాశి వారితో ఉండాలని అనుకుంటుంది. లక్ష్మీదేవి స్థిరత్వాన్ని, శ్రేయస్సును సూచిస్తుంది.

మిథున రాశి వారిని బుధుడు పాలిస్తాడు. సరస్వతీ సంభాషణ, జ్ఞానాన్ని ...