భారతదేశం, డిసెంబర్ 3 -- నేతాజి ప్రొడక్షన్స్, జిఎం ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ల మీద రిచర్డ్ రిషి హీరోగా తెరకెక్కిన సినిమా ద్రౌపది 2. సోల చక్రవర్తి నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి మోహన్. జి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

అయితే, ఇటీవ‌ల ఈ సినిమా నుంచి 'ఎం కోనె..(నెల‌రాజె..)' అనే పాట‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఈ పాటను టాలీవుడ్ పాపులర్ సింగర్ చిన్మయి శ్రీపాద ఆలపించారు. అయితే, ఈ పాటను పాడినందుక క్షమాపణలు చెబుతూ సింగర్ చిన్మయి పోస్ట్ పెట్టారు. అందుకు కారణం డైరెక్టర్ మోహన్ అని తెలిపింది చిన్మయి.

ఎం కోనె.. పాట‌ను ఆల‌పించిన సింగ‌ర్ చిన్మయి.. సాంగ్ విడుదలైన కొద్దిసేపటి తర్వాత త‌న సోష‌ల్ మీడియా ద్వారా ప్రజలకు క్షమాపణ చెప్పారు. రికార్డింగ్ సమయంలో ఈ సినిమా భావజాలం, దాని నేప‌థ్యం గురించి తాను తెలియకపోవ‌టం...