భారతదేశం, జనవరి 8 -- హీరో రిచర్డ్ రిషి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ద్రౌపది 2. నేతాజి ప్రొడక్షన్స్, జీఎం ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ల మీద సోల చక్రవర్తి భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. ఇప్ప‌టికే డిఫ‌రెంట్ ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్‌తో ద్రౌపది 2 సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.

ఈ సినిమాలో రిచర్డ్ రిషి హీరోగా చేయగా ఆయనకు జోడీగా రక్షణ ఇందుసుదన్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే, ఈ సినిమాలో చిరాగ్ జానీ విలన్‌గా చేస్తున్న ద్రౌపది 2 మూవీకి మోహన్ జీ దర్శకత్వం వహించారు. వీరి పాత్ర‌ల‌కు సంబంధించిన లుక్స్‌ను, నెల‌రాజె.. అనే పాట‌ను విడుద‌ల చేయ‌గా సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

తాజాగా బుధ‌వారం (జనవరి 7) రోజున ద్రౌపది 2 సినిమా నుంచి 'తారాసుకి రామ్' అనే పాట‌ను రిలీజ్ చేశారు మేక‌ర్స్‌. ఇందులో మహమ్మద్ బిన్ తుగ్ల‌క్ పాత్ర‌లో న‌ట...