Andhrapradesh,telangana, జూన్ 11 -- ద్రోణి ప్రభావంతో ఏపీలో ఈ 2 రోజులపాటు పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ మేరకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలను జారీ చేసింది. గంటకు 40-60 కి. మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని సూచింది. ప్రజలు హోర్డింగ్స్, చెట్ల క్రింద,శిథిలావస్థలో ఉన్న గోడలు,భవనాలు వంటి వాటి దగ్గర నిలబడరాదని హెచ్చరించింది.

ప్రకాశం,నెల్లూరు,నంద్యాల,కర్నూలు,అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. గతా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి- మోస్తారు వర్షాలు కురిసే అకాశం ఉందని అంచనా వేసింది.

ఇవాళ(జూన్ 11) విజయనగరం, పార్వతీపురంమన్యం, పశ్చిమగోదావరి,ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నెల్లూర...