భారతదేశం, జూన్ 12 -- తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. ఓవైపు ఉక్కపోత ఉంటున్నప్పటికీ. మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. ద్రోణి ప్రభావంతో. మరో రెండు రోజుల పాటు చెదురుమదురుగా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణశాఖ హెచ్చరికలను జారీ చేసింది.

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వివరాల ప్రకారం. రాష్ట్రంలో రెండు రోజులపాటు రాష్ట్రంలో చెదురుమదురుగా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

ఇవాళ(జూన్ 12) పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

ఇక తెలంగాణలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది....