Andhrapradesh,telangana, జూన్ 5 -- ఏపీ, తెలంగాణలో మరికొన్నిరోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణశాఖ వివరాలను తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉంది. మరోవైపు ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వానలు పడొచ్చు.

అమరావతి వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ వివరాల ప్రకారం... ఒక ద్రోణి దక్షిణ ఛత్తీస్ ఘడ్ నుంచి ఈశాన్య బంగ్లాదేశ్ వరకు విస్తరించింది. అక్కడ్నుంచి ఒడిశా, జార్ఖండ్ దానికి అనుకుని ఉన్న దక్షిణ బీహర్, బెంగల్ ఉత్తర ప్రాంతాల మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో విస్తరించి కొనసాగుతోంది. అంతేకాకుండా ఉత్తర అంతర్గత కర్ణాటక మరియు దానికి అనుకుని ఉన్న మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇప్పుడు సగట్టు సముద్రమట్టానికి 3.1 నుంచి 4.5 కి.మీ మధ్య విస్తరించి ఉంది. ...