భారతదేశం, డిసెంబర్ 31 -- ప్రసిద్ధ పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామంలో శివలింగం ధ్వంసం కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం ఉదయం ధ్వంసమైన స్థితిలో శివలింగం కనిపించడం కలకలం రేపింది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నిందితుడు ద్రాక్షారామం భీమేశ్వరాలయం ఉత్తర గోపురం సప్త గోదావరి ఒడ్డున ఉన్న కపాలేశ్వర స్వామి లింగాన్ని ధ్వంసం చేశాడు.

భక్తులు గోదావరి నది ఒడ్డున ఉన్న ఈ కోనేరులో స్నానం చేసి, శివలింగానికి పూజలు చేస్తారు. మంగళవారం ఉదయం ధ్వంసమైన శివలింగాన్ని చూసిన భక్తులు ఆలయ పూజారులకు సమాచారం అందించారు. స్థానికంగా ఈ విషయంపై కలకలం రేగింది. ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్న జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రాహుల్ మీనా, నిందితుడిని పట్టుకోవడానికి నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. తమ దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆలయం సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని ప...