భారతదేశం, మే 5 -- డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు దోస్త్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈసారి నైపుణ్యాలను పెంచే కోర్సులు, నూతన సిలబస్‌, సాంకేతిక హంగులను ప్రవేశపెట్టారు. ప్రతి సెమిస్టర్‌లో ఒక టెక్నాలజీ సబ్జెక్టును ప్రవేశపెడుతున్నట్టు అధికారులు వివరిస్తున్నారు. ఇంగ్లీష్ సబ్జెక్టులోనూ నైపుణ్యాలు పెంచేలా మార్పు చేస్తున్నారు. ఈ చర్యల కారణంగా.. విద్యార్థులకు డిగ్రీతోనే ఉద్యోగావకాశాలు పెరుగుతాయని ఉన్నత విద్యామండలి అధికారులు భావిస్తున్నారు.

తెలంగాణలో కొన్నేళ్లుగా డిగ్రీ కోర్సు రూపురేఖలు మారుతూ వచ్చాయి. చాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టమ్‌‌తో సెమిస్టర్‌ విధానం, నాలుగేళ్ల సబ్జెక్టులను ఎంచుకునే బకెట్‌ విధానాన్ని ప్రవేశపెట్టారు. గత రెండేళ్ల నుంచి చదువుకుంటూనే.. పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేస్తూ స్టైపెండ్‌ పొందే అప్రెంటిస్‌షిప్‌ ఎంబెడెడ్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌ (ఏఈడీపీ)...