భారతదేశం, ఏప్రిల్ 29 -- తెలంగాణలోని యూనివర్సిటీల పరిధిలో ఉన్న డిగ్రీ కాలేజీల్లో.. దోస్త్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. గతంలో దోస్త్ ప్రక్రియ ఇంటర్ రిజల్ట్ వచ్చిన రెండ్రోజుల్లో ప్రారంభం అయ్యింది. కానీ దోస్త్ 2025 నోటిఫికేషన్‌ విడుదలపై సందిగ్ధత నెలకొంది. మామూలుగా అయితే.. ఇంటర్‌ ఫలితాలు వెలువడిన మరుసటిరోజే దోస్త్‌ షెడ్యూల్‌ జారీచేసేవారు. ఈసారి ఫలితాలు వచ్చి వారం రోజులైనా నోటిఫికేషన్‌ ఎప్పుడు వెలువడుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు.

ఈసారి రెండు విడతల్లోనే దోస్త్‌ ద్వారా ప్రవేశాలు ఇచ్చి.. జూన్‌ 16 నుంచి తొలి సెమిస్టర్‌ తరగతులను ప్రారంభించాలని ఉన్నత విద్యాశాఖ భావించింది. అయితే ఇప్పటివరకు దోస్త్ నోటిఫికేషన్‌ వెలువడకపోవడంతో.. షెడ్యూల్‌ ప్రకారం తరగతులు మొదలవుతాయా? లేదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈసారి దోస్త్‌లో బకెట్‌ విధానాన్ని తొలగించాలని క...