భారతదేశం, జనవరి 29 -- రీసెంట్ గా ధురంధర్ మూవీతో బాక్సాఫీస్ ను షేక్ చేసిన బాలీవుడ్ స్టార్ ర‌ణ్‌వీర్ సింగ్‌ కు బిగ్ షాక్. ఈ స్టార్ హీరోపై ఎఫ్ఐఆర్ నమోదైంది. కొన్ని నెలల క్రితం రిషబ్ శెట్టి హీరోగా నటించిన 'కాంతార: ఎ లెజెండ్ - చాప్టర్ 1' చిత్రంలోని దైవ నటనను బహిరంగ కార్యక్రమంలో అనుకరించినందుకు ర‌ణ్‌వీర్ సింగ్‌ విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు ఎన్టీటీవీ ప్రకారం బెంగళూరులోని హై గ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‌లో ర‌ణ్‌వీర్ సింగ్‌ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ర‌ణ్‌వీర్ సింగ్‌ పై ఎఫ్ఐఆర్

కర్ణాటక కోస్తా ప్రాంతాలలోని హిందూ మత భావాలను, చాముండి దైవ సంప్రదాయాన్ని కించపరిచారని ర‌ణ్‌వీర్ సింగ్‌ పై ఆరోపణలు ఉన్నాయి. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 196, 299, 302 కింద ఈ కేసు నమోదైంది. బెంగళూరుకు చెందిన న్యాయవాది ప్రశాంత్ మెతల్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ ...