భారతదేశం, ఆగస్టు 14 -- దేశ రాజధాని దిల్లీలో దారుణం జరిగింది. నగరంలోని సివిల్ లైన్స్ ప్రాంతంలో ఆదివారం రాత్రి జరిగిన ఒక పార్టీలో.. ఓ 24 ఏళ్ల మహిళపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురుగ్రామ్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక కంపెనీలో వర్క్​ చేసిన ఆ మహిళకు ఆదివారం ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆమె స్నేహితుడు, సివిల్ లైన్స్​లోని తన ఇంట్లో ఏర్పాటు చేసిన పార్టీకి ఆహ్వానించాడు. ఆమె ఆ ఆహ్వానాన్ని అంగీకరించి, అండర్ హిల్ రోడ్ సమీపంలో ఉన్న ఆ ఇంటికి వెళ్లింది.

పార్టీలో ఆమె స్నేహితుడు, మరొక పరిచయస్తుడు, మరో ఇద్దరు యువకులు ఉన్నారు. వీరంతా కలిసి రాత్రి చాలాసేపు మద్యం తాగుతూ పార్టీ చేసుకు...