భారతదేశం, మే 26 -- విద్యుత్ కార్మికులకు కోటి రూపాయలకు పైబడి ప్రమాద బీమా అందిస్తున్నామని.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వివరించారు. దేశ చరిత్రలోనే ఇది ఒక రికార్డు అభివర్ణించారు. ఎన్పీడీసీఎల్ పరిధిలో విధులు నిర్వహిస్తూ.. జోగు నరేష్ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. ఆయన కుటుంబ సభ్యులకు సోమవారం ఉదయం ప్రజాభవన్‌లో కోటి రూపాయల ప్రమాద బీమా చెక్కును అందించారు. విద్యుత్ శాఖలో నరేష్ భార్యకు కారుణ్య నియామక ఉత్తర్వులు అందజేశారు.

'విద్యుత్ కార్మికునికి కోటి రూపాయల ప్రమాద బీమా చెక్కును అందించడం.. కేవలం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వంలోనే సాధ్యం అయ్యింది. గతంలో కార్మికుల కోసం ఏ ప్రభుత్వం ఇంత గొప్పగా ఆలోచన, ప్రయత్నం చేయలేదు. తమ ప్రభుత్వం వచ్చాకే ఇది సాధ్యం అయింది. ప్రమాద బీమా, కారుణ్య నియామక పత్రం అందించడం ప్రభుత్వ ఆలోచనకు, కార్యాచ...