Andhrapradesh,delhi, ఆగస్టు 24 -- అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) విడుదల చేసిన భారత ధనిక సీఎంల జాబితాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ఏడీఆర్ నివేదిక ప్రకారం. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అట్టడుగున ఉన్నారు.

అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖండూ 332 కోట్ల రూపాయల ఆస్తితో రెండో స్థానంలో నిలిచారు. ఇక కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రూ.51 కోట్ల ఆస్తితో మూడో స్థానంలో ఉన్నారు.

ఇక అప్పుల్లో చూస్తే. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండుకు రూ.180 కోట్ల అప్పులు ఉన్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేరిట రూ.23 కోట్ల అప్పులున్నాయి. చంద్రబాబు పేరిట ఉన్న అప్పుల విలువ రూ.10 కోట్లుగా ఉండగా.. ఈ...