భారతదేశం, జూన్ 15 -- రుతుపవనాల కారణంగా దేశంలోని చాలా ప్రాంతాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. తమిళనాడు, గోవా, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక తీర ప్రాంతాల్లో ఈ నెల 15న భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇక రాజస్థాన్, గుజరాత్, ఛత్తీస్​గఢ్, బీహార్, మధ్యప్రదేశ్​లోని కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

ఇతర రాష్ట్రాలకు ఐఎండీ యెల్లో అలర్ట్​ జారీ చేసింది. మరీ ముక్యంగా రాజస్థాన్​లో ధూళి తుపాను, పంజాబ్, హరియాణాలో వడగాలులు, బిహార్​లో వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని వెల్లడించింది.

" తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక కోస్తాలోని కారైకల్​లో అతి భారీ వర్షాలు (>20 సెం.మీ/ 24 గంటలు) కురిసే అవకాశం ఉంది. జూన్ 16 వరకు కేరళ అండ్ మాహేలో వర్షాలు పడతాయి," అని ఐఎండ...