భారతదేశం, నవంబర్ 20 -- బాలీవుడ్ పాపులర్ సెలబ్రిటీల్లో కరణ్ జోహార్ ఒకరు. స్టార్ కిడ్స్ ను ఇంట్రడ్యూస్ చేయడంలో మరింత ఫేమస్. దర్శకుడిగా, నిర్మాతగా తనదైన ముద్ర వేస్తున్నారు. అయితే కరణ్ జోహార్ పర్సనల్ లైఫ్ పై ఎప్పుడూ ఏవో ట్రోల్స్ వస్తూనే ఉంటాయి. తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ కరణ్ జోహార్ ఎమోషనల్ అయ్యారు.

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా హోస్ట్ చేస్తున్న 'సర్వింగ్ ఇట్ అప్ విత్ సానియా' షో తాజా ఎపిసోడ్‌కు ప్రముఖ సినీ నిర్మాత కరణ్ జోహార్ అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా సింగిల్ పేరెంట్స్ గా వారి అనుభవాలు, ప్రేమ అన్వేషణ వంటి అనేక విషయాలపై వీరిద్దరూ చర్చించారు. కరణ్ జోహార్ మాట్లాడుతూ ఒంటరిగా భోజనం చేసేటప్పుడు తనకి ఒంటరితనం ఆవహిస్తుందని ఒప్పుకున్నారు.

"నేను ఇప్పుడు బాగానే ఉన్నాను. ఒకానొక సమయంలో నాకు ప్రేమ కావాలని బలంగా కోరుకున్నాను. నాకు తోడు, ఒక బ...