భారతదేశం, నవంబర్ 21 -- వారణాసి గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌లో లార్డ్ హనుమాన్ గురించి ఎస్.ఎస్. రాజమౌళి చేసిన కామెంట్స్ వివాదాస్పదమైన నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అతనికి మద్దతుగా మాట్లాడాడు. రాజమౌళికి దేవుడిపై నమ్మకం లేదని చెప్పే హక్కు ఉందని వర్మ అన్నాడు. అయినా దేవుడిపై నమ్మకం లేదంటూ అదే దేవుడిపై ఎందుకు సినిమా తీస్తున్నాడని ప్రశ్నించిన వారికి కూడా అతడు గట్టి సమాధానమే ఇచ్చాడు.

వారణాసి ఈవెంట్ లో రాజమౌళి కామెంట్స్ పై విమర్శల నేపథ్యంలో శుక్రవారం (నవంబర్ 21) రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. అందులో అతడు చేసిన కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి. ఓ సుదీర్ఘమైన పోస్టు అతడు రాయడం విశేషం. "రాజమౌళి మీద భక్తులమని చెప్పుకుంటున్నవాళ్లంతా ఆ విషం కక్కుతున్నారు కదా.. వాళ్లకు తెలియాల్సింది ఏంటంటే: ఇండియాలో నాస్తికుడిగా ఉండడం తప్పు కాదు. రాజ్యాంగంలో ఆర్టికల్ 25 ఏం ...