భారతదేశం, మే 5 -- ఏపీలో లీజుల మాటున అన్యాక్రాంతమవుతున్న దేవుడి ఆస్తుల్ని వాటి అనుభవదారులకే కట్టబెట్టేలా ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న భూములు అన్యాక్రాంతమవుతున్నా ఆ శాఖ వాటిని కాపాడే ప్రయత్నాలు చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. లీజుల్ని పొడిగిస్తే అవి ఎప్పటికీ దేవుళ్లకు దక్కవని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం ఖాతరు చేయడం లేదు.

ఇటీవల విజయవాడలో ప్రముఖ విద్యా సంస్థలకు దేవాదాయ శాఖ భూమి లీజును పొడిగించే అంశం వెలుగు చూసింది. నగరం నడిబొడ్డున వందల కోట్ల ఖరీదు చేసే దుర్గగుడి ఆలయ భూముల్ని నామమాత్రపు ధరతో 50ఏళ్ళ పాటు లీజుకు ఇచ్చే ప్రతిపాదనల్ని దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు అడ్డుకున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ శాఖకు ఉన్న భూములపై సమగ్రంగా సర్వే జరిపించడంతో పాటు కొత్త లీజుల్ని పొడిగించడానికి సర్వే చేపట్...