భారతదేశం, అక్టోబర్ 3 -- కర్నూలు జిల్లాలోని దేవరగట్టు బన్నీ ఉత్సవంలో విషాదం చోటు చేసుకుంది. దసరా రోజున జరిగే కర్రల సమరంలో ఇద్దరు మృతి చెందారు. దాదాపు 100 మంది వరకు గాయపడ్డారు. అరికెరికి చెందిన తిమ్మప్ప, కర్ణాటకకు చెందిన బసవరాజును మృతులుగా గుర్తించారు.

ఇక గాయపడ్డ వారిలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. బాధితులకు ఆలూరు, ఆదోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. మాళమల్లేశ్వర స్వామి దక్కించుకునేందుకు ఈ బన్నీ పోటీ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈసారి రెండు లక్షలకుపైగా భక్తులు తరలివచ్చారు. కర్రలతో కొట్టుకొనే క్రమంలో తీవ్ర గాయాలపాలై.. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

ప్రతి సంవత్సరం ఇక్కడ కర్రల సమరం జరుగుతుంది. దీనినే బన్నీ ఉత్సవం అని కూడా అంటారు. విజయదశమి పండుగ నాడు అర్ధరాత్రి ఈ ఉత్సవం జరుగుతుంది. మాత మాళమ్మకు, మల్లేశ్వరునికి కల్యాణం ...