Hyderabad, మార్చి 19 -- చాక్లెట్లను తయారు చేయడానికి కోకో గింజలనే వినియోగిస్తారు. ఇవి లేకపోతే చాక్లెట్ తయారు కాదు. దీని రుచి పోషకాలు కూడా అద్భుతంగా ఉంటాయి. అందుకే దీన్ని దేవతల ఆహారంగా చెప్పుకుంటారు. ఆగ్నేయాసియా, మధ్య అమెరికా, పశ్చిమ ఆఫ్రికా, దక్షిణ అమెరికాలోని ప్రాంతాలలో ఎక్కువగా ఈ చెట్టు కనిపిస్తుంది.

నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన అధ్యయనం ప్రకారం కోకో గింజలు వాటి రుచికి ఎంతో ప్రసిద్ధి చెందాయి. చరిత్రలో పురాతన కాలంలో కూడా కోకో పానీయంగా పిలుచుకునే చాక్లెట్ ఉండేదని చెప్పుకుంటారు. ఇప్పట్లా చాక్లెట్ గట్టిగా కాకుండా పురాతన కాలంలో పానీయం రూపంలో ఉండేదని... దాన్ని దేవతలకు సమర్పించే వారని అంటారు. అందుకే కోకో గింజలతో తయారయ్యే చాక్లెట్ ను కూడా దేవతల ఆహారంగా చెప్పుకుంటారు.

డార్క్ చాక్లెట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నిజానికి కోకో గింజ...