భారతదేశం, ఏప్రిల్ 23 -- వరంగల్‌లో చేయూత స్వచ్ఛంధ సంస్థ నిర్వాహకుడు సాయి ప్రకాశ్ హత్య కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. హత్య అనంతరం పోలీసులకు చిక్కకుండా నిందితులు దృశ్యం సినిమాను తలపించేలా స్కెచ్ వేశారు. అయినా పోలీసులు కేసును చేధించి, ఆరుగురిని అరెస్ట్ చేశారు. సాయి ప్రకాశ్ హత్య, అరెస్టుకు సంబంధించిన వివరాలను వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ మంగళవారం సాయంత్రం వెల్లడించారు.

హనుమకొండ జిల్లా చింతగట్టుకు చెందిన భాషబోయిన శ్రీనివాస్ 2009లో కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయ్యాడు. హైదరాబాద్ లో ఉద్యోగం చేయాల్సి ఉండగా, పరస్పర బదిలీల్లో భాగంగా వరంగల్ కమిషనరేట్ కు వచ్చాడు. ఇక్కడ హనుమకొండ పీఎస్ లో క్రైమ్, కోర్టు కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తించాడు.

ఆ తరువాత 317 జీవో బదిలీల్లో భాగంగా శ్రీనివాస్ ను ములుగు జిల్లా వెంకటాపురం స్టేషన్ కు ట్రాన్స్ ఫర్ చేశారు. కాగా ...