భారతదేశం, జనవరి 2 -- ఎలక్ట్రిక్ వాహనాలు (EVs), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో పెట్టుబడులు పెరుగుతుండటంతో ఈ జోరు మున్ముందు కూడా కొనసాగుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. శుక్రవారం (జనవరి 2, 2026) ట్రేడింగ్‌లో నిఫ్టీ 50, నిఫ్టీ మెటల్ సూచీలు తమ జీవితకాల గరిష్టాలను తాకాయి. నిఫ్టీ 50 ఇండెక్స్ 26,340 మార్కును చేరగా, నిఫ్టీ మెటల్ 11,433.80 వద్ద కొత్త రికార్డు సృష్టించింది. ప్రధాన సూచీ నిఫ్టీ 50 గత నెలలో కేవలం 1% మాత్రమే లాభపడగా, మెటల్ ఇండెక్స్ మాత్రం దానికి పది రెట్లు పైగా రాబడిని అందించడం విశేషం.

హిందుస్థాన్ కాపర్: గత నెలలో ఏకంగా 60% లాభపడి ఇన్వెస్టర్లను ఆశ్చర్యపరిచింది.

హిందుస్థాన్ జింక్, నేషనల్ అల్యూమినియం, వేదాంత: ఈ షేర్లు 15% నుంచి 27% మధ్య పెరిగాయి.

మెటల్ స్టాక్స్ ఇంతలా పుంజుకోవడానికి దేశీయ, అంతర్జాతీయ కారణాలు బలంగా ఉన్నాయి. అవేంటో చూద్దా...