భారతదేశం, అక్టోబర్ 4 -- దేశంలో మెంటల్​ హెల్త్​పై అవేర్​నెస్​ ఇటీవలి కాలంలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే సైకాలజీ కోర్సుల్లో చేరే వారి సంఖ్య సైతం ఊపందుకుంది. మరీ ముఖ్యంగా దూరవిద్య (డిస్టెన్స్​ లెర్నింగ్​) ద్వారా చదువుకోవాలనుకునే వారికి ఓపెన్, డిస్టెన్స్ లెర్నింగ్ విధానం ఒక పెద్ద అవకాశాన్ని ఇచ్చింది. కానీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తీసుకున్న ఒక కీలక నిర్ణయం ఇప్పుడు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది! దూరవిద్యలో సైకాలజీ డిగ్రీలను పూర్తిగా రద్దు చేస్తూ యూజీసీ తీసుకున్న ఈ నిర్ణయం విద్యారంగంలో పెద్ద చర్చకు దారి తీసింది!

యూజీసీ తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా సుమారు 1.3 లక్షల మంది విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇందులో ఇప్పుడు అండర్‌గ్రాడ్యుయేట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్ సైకాలజీ కోర్సుల్లో ఉన్న విద్యార్థులు, ...